తిరుపతి తొక్కిసలాటపై విచారణ ప్రారంభం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు అంతా సిద్ధమయింది.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు అంతా సిద్ధమయింది. జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాటి జరిగి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు.
విచారణ కోసం...
విచారణ కోసం తిరుపతిలోని కలెక్టరేట్‌లో ప్రత్యేక ఛాంబర్ ను ఏర్పాటు చేశారు. తొక్కిసలాట ప్రాంతాలను పరిశీలించిన కమిషన్ సభ్యులు పరిశీలించారు. బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాల పరిశీలించిన కమిటీ సభ్యులు నేడు టీటీడీ అధికారులు, పోలీసులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆరు నెలల్లో నివేదికఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం అదేశించిన నేపథ్యంలో విచారణ వేగంగా సాగుతుంది.