Ys Jagan : జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం
వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ ఆస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ ఆస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాల్మియాతో కంపెనీ ఆస్తులు జప్తు చేసింది. సుమారు 793 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ అధికారులు క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలపై ఆస్తులను జప్తు చేసింది కడప జిల్లాలో 417 ఎకరాల్లో సున్నపు రాయి గనులను నాటి వైఎస్సార్ ప్రభుత్వం లీజుకిచ్చిందని ఈడీ ఆరోపించింది.
ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పిన సీబీఐ 2013లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ క్విడ్ ప్రోకో ద్వారా వైఎస్ జగన్ సుమారు 150 కోట్ల మేరకు లబ్దిపొందినట్లు తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా తాజాగా 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. యాభై కోట్లు , 95 కోట్ల విలులైణ షేర్లు హవాలా రూపంలోనూఇచ్చినట్లు దాల్మియాపై అభియోగాలున్నాయి.