తిరుపతిజిల్లాలో ఏనుగుల దాడి.. రైతు మృతి
తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడి ఆందోళన కలిగిస్తుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు
తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడి ఆందోళన కలిగిస్తుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు. రాత్రి చిన్న గొట్టిగల్లు మండలం చిట్టేచర్లలో ఏనుగుల దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పొలం నుంచి ఇంటికెళ్తున్న సిద్ధయ్యను ఏనుగు చంపిందని తెలిపారు. మృతుడు దాసరిగూడెం వాసి సిద్ధయ్యగా గుర్తించారు. సిద్ధయ్య వయసు 72 సంవత్సరాలు.
కొద్ది రోజులుగా...
గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ భయాందోళనలను కలిగిస్తున్నాయని, పంటలను నాశనం చేస్తున్నాయని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేదని ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు. వారి ఫిర్యాదును స్వీకరించిన తర్వాత రెండు ఏనుగులను అటవీప్రాంతంలోకి తరిమిన అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శేషాచలం అటవీప్రాంత సమీప రైతులు భయాందోళనలో ఉన్నారు.