Andhra Pradesh : ఏపీలో త్వరలో మరో ఎన్నిక.. ఆ స్థానం ఆ పార్టీకేనా?
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మరొక ఎన్నిక జరగనుంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.
Ap 2024 budget meeting today
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మరొక ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాను వైస్ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆమోదించారు. వైస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించడంతో ఏపీలో ఎన్నిక అనివార్యమయింది.
మూడు పార్టీల్లో ఎవరికి?
త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే శాసనసభలో బలాబాలాలను బట్టి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీలో జరిగే ఎన్నికల్లో కూటమి పార్టీకే ఆ స్థానం దక్కనుంది. అయితే టీడీపీకి దక్కనుందా? బీజేపీకి చెందనుందా? లేక ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారా? అన్నది త్వరలోనే కూటమి పార్టీ అగ్రనేతలు కూర్చుని చర్చించుకుని నిర్ణయిస్తాయి.