పట్టుబట్టి సాధించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది

Update: 2025-02-15 12:44 GMT

నెల్లూరు రూరల్ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. సుమారు 40 కోట్ల రూపాయల విలువైన 302 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ పనులకు సంబంధించి శంకుస్థాపనలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలలుగా నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అసంపూర్తిగా ఉన్న పనులు...
నియోజకవర్గం లో అసంపూర్తిగా ఉన్న పనులతో పాటు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణను రూపొందించి నిధులను సాధించారు. అభివృద్ధి పనుల విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముందంజలో ఉంది. ప్రభుత్వంపై పట్టుబట్టి సాధించడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నం ఫలించింది.


Tags:    

Similar News