సాకే చేరికపై డొక్కా ఏమన్నారో తెలుసా?

వైసీపీలో చేరిన సాకే శైలజనాథ్ కు డొక్కా మాణిక్య వరప్రసాద్ సలహా ఇచ్చారు.

Update: 2025-02-07 08:04 GMT

వైసీపీలో చేరిన సాకే శైలజనాథ్ కు డొక్కా మాణిక్య వరప్రసాద్ సలహా ఇచ్చారు. వైసీపీలో విలువలు ఉండవని, అది ఒక దుర్మార్గమైన పార్టీ అని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని, తర్వాత ఎవరూ మిమ్మల్నిపట్టించుకోరని ఆ పార్టీలో చేరడం అనవసరమని ఆయన సలహా ఇచ్చారు.

చేరే సమయంలో...
పార్టీలో చేరే సమయంలో నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తారని, తర్వాత జగన్ రెడ్డి రాజకీయ అత్యాచారం చేయిస్తారంటూ సాకే శైలజానాధ్ తెలుసుకుంటే మంచిదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే శైలజనాథ్.. వైసీపీ చేరకుంటే మంచిదని డొక్కా మాణిక్య వరప్రసాద్ సలహా ఇచ్చారు. చేరికపై పునరాలోచించుకోవాలని కోరారు.


Tags:    

Similar News