Pawan Kalyan : బ్లాక్ మెయిల్ చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలి : పవన్
అటవీ, పర్యావరణశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష చేశారు
అటవీ, పర్యావరణశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష చేశారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై పవన్ కల్యాణ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, ఇచ్చిన నోటీసులు వంటి వాటిపై కూడా పవన్ కల్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బొండా ఉమ చేసిన ఆరోపణలపై...
ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అసెంబ్లీ లో చేసిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ సమీక్షించారు. పీసీబీని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని చూసేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పెట్టుబడులు ప్రోత్సహిస్తూనే.. కాలుష్యం నియంత్రించేలా ముందుకెళ్లాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని ఫార్మా కంపెనీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.