Andhra Pradesh : ఏపీలో పంచాయతీ సర్పంచ్ లకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో్ పంచాయతీ సర్పంచ్ లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-08-28 05:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో్ పంచాయతీ సర్పంచ్ లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టంబరు నెలలో 1,120 కోట్ల కోట్ల రూపాయల పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పెండింగం లొ ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదల వుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. '

హామీ ఇచ్చినట్లు గానే...
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు గానే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో సద్వినియోగం చేయాలన్న దృఢమైన వైఖరిని ప్రభుత్వం తీసుకుందని ఆయన తెలిపారు. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థంగా అందించాలన్నదే తమ ఉద్దేశం అని పవన్ కల్యాణ్ తెలిపారు.. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి, ముఖ్మంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


Tags:    

Similar News