Flash: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పై హత్యాయత్నం

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు

Update: 2025-02-13 05:39 GMT

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనపై హత్యాయత్నానికి దిగారు. చింతమనేని ప్రబాకర్ తో పాటు ఆయన సిబ్బందిపై కూడా అల్లరిమూకలు దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే దాడి చేసింది ఎవరన్నది ఇంకా తెలియరానప్పటికీ ఈ దాడి నుంచి చింతమనేని ప్రభాకర్ తప్పించుకున్నారు.

గన్ మెన్లు అప్రమత్తం కావడంతో...
ఆయన గన్ మెన్లు వెంటనే అప్రమత్తం కావడంతో చింతమనేని ప్రభాకర్ సేఫ్ గా ఉన్నారు. ఏలూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో చింతనమేని ప్రభాకర్ పై దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. చింతమనేనిపై ఎందుకు దాడి చేశారు? దాడి వెనక ఎవరున్నారు? అన్న కోణంలో దర్యాప్తును పోలీసులు చేస్తున్నారు. అయితే తనపై దాడి చేసింది మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఒక వివాహ వేడుకకు హాజరై వస్తుండగా ఈ దాడికి యత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో దెందులూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News