మైలవరంలో కాలుష్యం పై పోస్టుకార్డు ఉద్యమం.. పవన్ వద్దకే
మైలవరం కాలుష్యంపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు 10 వేల ఉత్తరాలు పోస్టు చేయాలని నిర్ణయించారు.
Pawan Kalyan
ఉపముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు 10 వేల ఉత్తరాలు పోస్టు చేయాలని నిర్ణయించారు. మైలవరం థర్మల్ విద్యుత్ ప్లాంట్ కాలుష్యం పై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా ఉపముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు 10 వేల పోస్ట్ కార్డు ఉత్తరాలు పంపనున్నారు.
జనసేన నేతల నుంచి...
ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధికారప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి అక్కల గాంధీ పాల్గొని తన కార్డు నాయడమే కాకుండా..ఇతరుల కు అవగాహన కల్పించారు. షాప్ టూ షాప్ తిరిగి అందరికీ అవగాహన కల్పించి అందరితో ఉత్తరాలు రాయించి పోస్టు చేశారు. తమ వంతు భాధ్యతగా స్థానిక ప్రజల కు అండగా నిలడాలని పవన్ ను కోరనున్నారు.