Andhra Pradesh : నేడు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

నకిలీ మద్యం తయారీ కేసులో ఐదుగురు నిందితుల కస్టడీ పిటీషన్లపై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-10-27 03:57 GMT

నకిలీ మద్యం తయారీ కేసులో ఐదుగురు నిందితుల కస్టడీ పిటీషన్లపై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు జనార్థనరావును తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో జోగి రమేష్ సూచనలతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు ఆయన విచారణలో వెల్లడించారు.

కస్టడీకి ఇవ్వాలని...
ఈరోజు నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న ఏ 7 నిందితుడు బాదల్ దాస్, ఏ8 ప్రదీప్ దాస్, ఏ 15 రమేష్, ఏ 16 అల్లా బక్షు, , ఏ 17 సతీష్ బాబులను తమకు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. పూర్తి ఆధారాలను సేకరించడానికి నిందితుల కస్టడీ అవసరమని కోరింది.


Tags:    

Similar News