Tirumala : తిరుమల నేడు వెళుతున్నారా...? అయితే వెంటనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శనివారమయినా భక్తులు అంతగా లేరు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శనివారమయినా భక్తులు అంతగా లేరు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శనివారం భక్తులు మరింత ఎక్కువ మంది తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆపద మొక్కుల వాడికి శనివారం అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు శనివారం రావడానికే ఇష్టపడుతుంటారు. కానీ ఈరోజు మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
మూడు నెలల నుంచి...
గత మూడు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉంది. మే 15వ తేదీ నుంచి ప్రారంభమయిన తిరుమలలో భక్తుల రద్దీ జులై నెల వరకూ కొనసాగింది. హుండీ ఆదాయం కూడా భారీగానే తిరుమల దేవస్థానానికి సమకూరింది. అయితే ఆగస్టు మాసం నుంచి కొద్దిగా కొద్దిగా భక్తుల రద్దీ తగ్గడం ప్రారంభమయిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అయితే వీకెండ్ లో మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అనుకున్నప్పటీకీ ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది.
ఆరు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,353 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,,636 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.