Andhra Pradesh :ఇంకా పాతపేర్లతోనే ప్రశ్నలు.. అసెంబ్లీ సచివాయ సిబ్బంది అలసత్వం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం సిబ్బందిపై విమర్శలు వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం సిబ్బందిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారి పదిహేను నెలలు అవుతున్నప్పటికీ నేటికీ పథకాల పేరును మార్చడంలో అధికారులు అలసత్వం కనిపిస్తుంది. దీనిపై అధికార పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సచివాలయం అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ప్రశ్నోత్తరాల సమయంలో
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ప్రభుత్వ పథకాల పేర్లే ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా అసెంబ్లీ సిబ్బంది తీరు మార్చుకోలేదని అధికార పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా అమలు చేసిన పథకం పేరును అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం డా.ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చింది. ఈ విషయాన్ని ఇంకా గుర్తించని అసెంబ్లీ సచివాలయం శాసనసభ ప్రశ్నోత్తరాలకు పోస్ట్ చేసిన రెండు ప్రశ్నల్లో ఆరోగ్యశ్రీ అని ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది.