వల్లభనేని పిటీషన్ పై నేడు విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్‌పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్‌పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్ తో పాటు ఇంటి నుంచి భోజనవసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో వల్లభనేని వంశీ కోరారు.
సబ్ జైలులో...
అయితే సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయని? ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖతీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వంశీ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీకోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటు వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసుల వేసిన పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది.