Andhra Pradesh : ఏపీలో మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ేకేసులు నమోదయ్యాయి. నంద్యాల, విశాఖపట్నం, కడప జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లాలో...
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు కలెక్టరేట్ లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వారిని హోం ఐసొలేషన్ లో ఉంచారు. హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రజలు కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.