నేడు ఒంగోలుకు వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు ఒంగోలు రానున్నారు. విచారణకు హాజరు కానున్నారు

Update: 2025-02-07 03:20 GMT

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు ఒంగోలు రానున్నారు. విచారణకు హాజరు కానున్నారు. నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జవీ హాజరుకానున్నారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో గత నవంబర్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను వర్మ తీసుకున్నారు.

ముందస్తు బెయిల్ తీసుకున్నా...
అయితే పోలీసుల విచారణకు సహకరించాలని రామ్ గోపాల్వర్మను న్యాయస్థానం ఆదేశించడంతో ఆయన పలుసార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదు. తనకు షూటింగ్ లు ఉన్నాయని తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు మాత్రంవిచారణకు హాజరుకావాలని పోలీసులు తిరిగి నోటీసులు ఇవ్వడంతో విచారణకు వస్తానని పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.


Tags:    

Similar News