నేడు ఒంగోలు పోలీస్ స్టేషన్ కు రాంగోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు రానున్నారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు రానున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో...
మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో అందిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను విచారించారు. అయితే వర్మ హైకోర్టుకు వెళ్లి తాను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పీఎస్‍లో కేసు నమోదు కావడంతో నేడు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు మరోసారి విచారణకు హాజరవుతున్నారు.