Ys Sharmila : నేడు చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల కలవనున్నారు. ఈ మేరకు చంద్రబాబు అపాయింట్ మెంట్ ను షర్మిల కోరగా ఆయన అంగీకరించారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై చంద్రబాబుతో వైఎస్ షర్మిల చర్చించనున్నారు.
రైతు సమస్యలపై...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతల ఆక్రందనలపై కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో కలిసి సీఎం చంద్రబాబుకి వినతిపత్రం వైఎస్ షర్మిల ఇవ్వనున్నారు. టమాటా, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో పాటు యూరియా కొరత వంటి అంశాలను చర్చించనున్నారు. దీంతో పాటు రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశముంది.