విజయవంతంగా ముగిసిన సీఐఎస్‌సీఈ సమావేశం
సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్‌లో విజయవంతంగా సీఐఎస్‌సీఈ సమావేశం జరిగింది.
సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్‌లో విజయవంతంగా సీఐఎస్‌సీఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి ఐసీఎస్ఈ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం కీలక పాత్రను సిఐఎస్‌సిఈ చీఫ్ యు.ఎ. సుందరి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి జరుగుతున్న సహకార కృషిపై తన అభిప్రాయం వెల్లడించారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు.
రెండు రాష్ట్రాలకు చెందిన...
రెండు రాష్ట్రాల ఐసిఎస్‌ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమానికి సిఐఎస్‌సిఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు కార్యదర్శి డాక్టర్ జోసెఫ్ ఇమాన్యుయెల్ నాయకత్వం వహించారు. సమగ్ర అభివృద్ధి మరియు నూతన బోధనా పద్ధతులను ప్రోత్సహించడానికి NEP-2020 మార్గదర్శకాలను అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. సమావేశం ప్రారంభంలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంత సిఐఈఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన ప్రాంతీయ కార్యదర్శి శ్రీమతి యు.ఎ. సుందరి హృదయపూర్వక స్వాగతం పలికారు.
విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు...
విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి జరుగుతున్న సహకార కృషిపై శ్రీమతి సుందరి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిఐఎస్‌సిఈ ఛైర్మన్ డాక్టర్ ఇమ్మాన్యుయల్ మరియు సిఐఎస్‌సిఈ డిప్యూటి సెక్రటరీ డాక్టర్ సంగీత భాటియా కార్యక్రమ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించారు. NEP-2020ని సమర్థంగా అమలు చేయడంపై ప్రధానోపాధ్యాయులు అభిప్రాయాలను పంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు విద్యా రంగంలో ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలని సంకల్పించారు.