Andhra Pradesh : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. మూడు నుంచి నాలుగు నెలల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులతో ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు నుంచినాలుగు నెలల వ్యవధి లో మున్సిపల్ ఎన్నికల ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం కూటమి పార్టీలు సొంతం చేసుకునేలా మంత్రులు ఇప్పటి నుంచే జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలను సిద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. దీంతో మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది.
ప్రజల్లో అవగాహన కల్పించేలా...
మంత్రి వర్గ సమావేశంలో జలధార పై ప్రజలలో అవగాహన పెంచాల్సి ఉందన్న చంద్రబాబు పాసుబుక్స్ పై రెవెన్యూ అధికారులు, సంబంధిత మంత్రులు నెలకు నాలుగు సార్లు విజిట్ చేయాలని కోరారు. సూర్య ఘర్ పై మరింత గా దృష్టి సారించాలని, వచ్చే ఏడాది తో సూర్య ఘర్ పథకం ముగియనుండటంతో లక్ష్యాలను చేరుకోవాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే మహిళా బిల్లు పై చర్చ జరిగింది. మహిళ బిల్లుకు తెలుగుదేం పార్టీ తొలినుంచి అనుకూలమని, ఎన్టీఆర్ నాటి పార్టీపెట్టిన నాటి నుంచే మహిళలకు రాజకీయాల్లో అవకాశం కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు.
సమాచార గోప్యతపై...
మరొకవైపు సమాచార గోప్యతపై మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ సమాచారం ఎలా లీక్ అవుతుందని ప్రశ్నించారు. ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగా లీకైతే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న చంద్రబాబు, మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలోని అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు కూటమి పార్టీలనేతల మధ్య సమన్వయం ఉండేలాచర్యలు తీసుకోవాలని కోరారు. తమ శాఖ పనితీరును కూడా మెరుగుపర్చుకోవాలని సూచించారు.