ప్రధానికి చంద్రబాబు ఆహ్వానం
భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఙప్తి చేశారు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఙప్తి చేశారు. విమానాశ్రయం ప్రారంభానికి రావాలని ప్రధానికి ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. ఇందుకు ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
భోగాపురం విమానాశ్రయం...
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. జులై 5 లేదా 8, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో సమయమివ్వాలని కోరారు. విమానాశ్రయ పనులు త్వరగా పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థను ప్రభుత్వం కోరింది. జూన్ 30వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో పనులు వేగవంతం చేశారు.