30న వినుకొండకు జగన్

ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేయూత నిధులు విడదల చేయనున్న జగన్

Update: 2023-01-27 06:38 GMT

ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేయూత కార్యక్రమానికి సంబంధించి నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. జగనన్న చేయూత పథకం మొత్తం 75 వేలు ఇస్తానని ఈ పధకాన్ని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు విడతలుగా ఈ సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జగన్ జమ చేయనున్నారు.

నాలుగో విడతగా...
ఇప్పటికి మూడు విడతలుగా సాయం అందించారు. 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వరకూ వయసున్న మహిళలకు ఈ చేయూత పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలను ఎంపిక చేసి వారి ఖాతాల్లో విడతలు వారీగా జమ చేయనున్నారు. వినుకొండలో నాలుగో విడత జగనన్న చేయూత నిధులను విడుదల చేయనున్నారు. వినుకొండలో జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News