యువ లాయర్లు నిలదొక్కుకునేందుకే

జూనియర్ న్యాయవాదులకు చేదోడుగా ఉండేదుకే వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు

Update: 2023-02-22 06:23 GMT

జూనియర్ న్యాయవాదులకు చేదోడుగా ఉండేదుకే వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆయన జూనియర్ లాయర్లకు వారి ఖాతాలో నిధులను విడుదల చేశారు. యువ న్యాయవాదులను మరింత ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. ఈరోజు జగన్ 2,011 మంది లబ్దిదారులకు 1.55 కోట్ల నగదును జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

కార్పస్ ఫండ్ కింద...
లా డిగ్రీ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు సంవత్సరాలపాటు నెలకు రూ.5,000ల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ వైఎస్సార్ లా నేస్తం పథకం కింద 4,248 మందికి నిధులు విడుదల చేశామని జగ్ తెలిపారు. మూడున్నరేళ్లలో మొత్తం 35.40 కోట్ల రూపాయలను ఈ పథకం కింద అందచేశామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం వంద కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. కోవిడ్ సమయంలోనూ ఈ కార్పస్ ఫండ్ నుంచి 25 కోట్ల నిధులను విడుదల చేశామని జగన్ గుర్తు చేశారు.


Tags:    

Similar News