జగన్ గుడ్ న్యూస్.. మూడు ప్రాంతాల్లో?
ఏపీలోని క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ క్యాన్సర్ రోగులకు అండగా నిలిచారు. ఏపీలోని క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని జగన్ డిసైడ్ చేశారు. క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లేనందున ఏపీ ప్రజలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వెళుతున్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా....
కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కళాశాలలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి అదనంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించనున్నారు.