Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

Update: 2025-05-12 03:11 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. వివిధ శాఖలపై సమీక్షను నిర్వహిస్తారు. మంత్రులు, అధికారులతో మాట్లాడి ఆ యా శాఖల పనితీరును కూడా పరిశీలించి తగినట్లు దిశానిర్దేశం చేయనున్నారు.

వివిధ శాఖలపై సమీక్షలను...
ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడ గంటలకు గిరిజన శాఖపై సమీక్ష చేస్తారు. గిరజనులకు అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు రహదారి సౌకర్యాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News