జగనన్న టౌన్ షిస్ ను నేడు జగన్

పట్టణ, నగర ప్రాంతాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు జగన్ నేడు వెబ్ సైట్ ను ప్రారంభించనున్నారు.

Update: 2022-01-11 03:39 GMT

పట్టణ, నగర ప్రాంతాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ నేడు వెబ్ సైట్ ను ప్రారంభించనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీటి కొనుగోళ్లకు సంబంధించి వెబ్ సైట్ ను జగన్ ప్రారంభించనున్నారు. తొలి దశలో గుంటూరు జిల్లాలోని నవులూరు, అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వద్ద లే అవుట్ లు సిద్దమయ్యాయి.

నేటి నుంచి...
వీటి కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని అనుమతులు, వసతులతో ఈ లే అవుట్ లను రూపొందించారు. 150,200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు. వీటి కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ వెబ్ సైట్ ను క్యాంప్ కార్యాలయం నుంచి నేడు ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News