Chandrababu : బటన్ నొక్కినంత మాత్రాన ఓట్లేయరు : చంద్రబాబు

సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడితే ప్రజలు గెలిపించరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Update: 2025-02-08 11:56 GMT

సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడితే ప్రజలు గెలిపించరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. బటన్ నొక్కుతున్నామంటూ విచ్చలవిడిగా అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. బటన్ నొక్కే కార్యక్రమాలు ఏపీ, ఢిల్లీలో సక్సెస్ కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రంలోనూ, ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్న చంద్రబాబు సంక్షేమం పేరు చెప్పి అవినీతికి పాల్పడిన వారిని జనం గెలిపించరని మరోసారి రుజువయిందని తెలిపారు. తనను అరెస్ట్ చేసినప్పుడు అరవై దేశాల్లో ప్రజలు నిరసనలు తెలియజేశారనిచంద్రబాబు అన్నారు.

60 దేశాల్లో నిరసనలు...
నిరసనలు అణిచి వేయాలని చూసిన వారు కూడా ఫలితం అనుభవించారని చంద్రబాబు అన్నారు. లిక్కర్ సేరుతో సిస్టమ్ ను సర్వనాశనం చేశారన్న చంద్రబాబు నాయుడు ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ నాయకత్వాన్ని నమ్మి ఢిల్లీ ప్రజలు ఓటేశారన్నారు. దేశరాజధాని ప్రజలు విజ్ఞతతో ఓటు వేశారన్న ఆయన దేశ ప్రజలందరి ఆత్మగౌరవానికి ఇది గెలుపు అని చంద్రబాబు అన్నారు. దేశ, రాష్ట్ర రాజధానులు ప్రజల ఆంకాక్షలను తీర్చే విధంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం కలసి ఢిల్లీని మార్చివేశాయని తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకత్వం అవసరమని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తానని తాను అంటుంటే.. కేసులు పెట్టుకో... జైల్లో వేసుకో అంటే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ఆదాయం ఎప్పటికప్పుడు పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు.


Tags:    

Similar News