ఏపీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా : చంద్రబాబు

ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Update: 2025-08-10 01:45 GMT

ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు న్యాయసహాయం, పోలీసింగ్ సహా వివిధ కేటగిరీల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలవటంపై వచ్చిన కథనాలపై స్పందించిన సీఎం రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ అంశాల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ కీలకమైన మైలు రాయిని అందుకున్నా సంతృప్తి చెందటం లేదని, ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేంత వరకూ నిర్విరామంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సత్వర న్యాయం కోసం...
సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ సహా వివిధ అంశాల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్ లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సత్వర న్యాయం అందటం శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియా జస్టిస్ సంస్థ ఏపికి ఈ ర్యాంకింగ్ ఇచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంతో ఏపీ ర్యాంకింగ్ దిగజారిపోయిందని పలు కథనాలు పేర్కొన్నాయి.


Tags:    

Similar News