Chandrababu : నేడు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరస భేటీలు జరుపుతున్నారు.

Update: 2025-07-22 04:56 GMT

పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరస భేటీలు జరుపుతున్నారు. ఈరోజు నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రోజువారీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈరోజు సమావేశమయ్యే ఎమ్మెల్యేలు సచివాలయానికి చేరుకన్నారు.

పార్టీని బలోపేతంపై...
ఇప్పటివరకు పద్దెనమిది మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు-పరిష్కారాలు, పార్టీ పదవులపై వంటి ప్రధాన అంశాలు అజెండాగా భేటీ జరగనుంది. నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను కూడా అడిగి తెలుసుకోనున్నారు.


Tags:    

Similar News