Chandrababu: నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. నెలలోపు ఉద్యోగాలు
Chandrababu: నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. నెలలోపు ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. నెల రోజుల్లోపు డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించార. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే P4 పథకం కింద లక్ష బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల అప్పులు తీర్చాలని, గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు నెల నాటికి డయాఫ్రం వాల్ పూర్తవుతుందని అన్నారు.
గోదావరి పుష్కరాలు...
గోదావరి పుష్కరాలు కూడా మూడోసారి తానే చేయబోతున్నానని, అద్భుతంగా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు వృద్ధులు,వితంతవులకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. నూటికి పదమూడు మందికి పింఛన్లు ఇస్తున్నామన్నచంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఏపీని పునర్నిర్మాణం చేసి దెబ్బతిన్న వ్యవస్థలన్నింటిని గాడిన పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.