Chandrababu : పదిహేను మంది ఎమ్మెల్యేల డుమ్మాపై చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ విస్తృతస్థాయి సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-06-30 03:00 GMT

టీడీపీ విస్తృతస్థాయి సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి పదిహేను మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వివిధ కారణాలు చెబుతూ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో అడిగి తెలుసుకున్నారు.

రాజకీయాలు మానుకోవాలంటూ...
వీరిలో కొందరు విదేశీ పర్యటనల్లో ఉండగా, మరికొందరు దైవ దర్శనాల్లో ఉన్నారని తెలుసుకుని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకుంటున్నారని.. ప్రజలకు దూరంగా ఉండడం సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలను వేసే బదులు, రాజకీయాలు మానుకుని ఫారిన్‌లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చురకలు అంటించారు. సమావేశాలు ఉన్నప్పుడే దైవ దర్శనాలు పెట్టుకోవాలా? మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అసహనం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News