రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2026-03-29 03:04 GMT

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఉడాన్ పథకం కింద కడప, కర్నూలు నుంచి ఢిల్లీకి విమానాలు నడుపుతామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిన పనులు మరో గుత్తేదారుకు అప్పగించామన్నారు. జూన్ చివరి నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు.

ఢిల్లీకి విమానాలు...
అమరావతిలో అధునాతన నగరానికి అనుగుణంగా ఎయిర్ పోర్టు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 సీ ప్లేన్ స్ట్రిప్స్ అడుగుతుందని తెలిపారు. ప్రకాశం, శ్రీశైలం, పులికాట్, అరకు సహా పలు చోట్ల సీ ప్లేన్ స్ట్రిప్స్ రాబోతున్నాయన్నారు. ఉడాన్ 2.0 ప్రధాని మే నెలలో ప్రారంభం చేస్తారన్నారు. ఢిల్లీలో మీడియాతో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.


Tags:    

Similar News