పెద్దిరెడ్డి మాఫియా డాన్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2022-01-08 13:52 GMT

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని కూడా తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేస్తూ పెద్దిరెడ్డి గ్యాంగ్ పెద్దయెత్తున ధనాన్ని సంపాదిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. స్థానికులను బెదిరించి మరీ క్వారీయింగ్ చేసుకుంటున్నారని అని అన్నారు. అఖండ సినిమాకు మించిన రీతిలో కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని అన్నారు.

అక్రమ మైనింగ్ తో....
కుప్పంలో జరిగే అక్రమ మైనింగ్ వెనక మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ కు మాత్రమే కాకుండా కేంద్ర అటవీశాఖ కు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మంత్రిగా పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి దందాకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పెద్దిరెడ్డి మాఫియా డాన్ గా పనిచేస్తున్నారని అన్నారు.


Tags:    

Similar News