Chandrababu : చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఎన్నికయ్యారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయిన చంద్రబాబును పలువురు అభినందించారు. మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. అయితే ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. చంద్రబాబు ఎన్నికయినట్లు ఆయనకు పత్రాన్ని వర్ల రామయ్య అందచేశారు.
జాతీయ అధ్యక్షుడిగా...
అనంతరం చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ముప్పయి ఏళ్లుగా చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికను నిర్వహిస్తుంటారు. 1995లో మొదటి సారి చంద్రబాబు పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన చంద్రబాబుకు పార్టీ నేతలు, మంత్రులు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.