Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకంలో నిబంధనలు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు

Update: 2025-05-18 06:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుమహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించడం పట్ల మహిళలు ఉచిత బస్సు పథకం అమలు కోసం సుదీర్ఘకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా మూడు నెలలు సమయం ఉండటంతో మహిళలు అప్పటి వరకూ వెయిట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఉచిత బస్సు పథకం అమలులో ప్రభుత్వం ఏ ఏ నిబంధనలను విధిస్తుందోనన్న ఆందోళన అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది.

ఖజానాకు భారం కాకుండా...
ఈ పథకం ఇప్పటికే అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణలో కొంత సక్సెస్ గా కనిపిస్తున్నప్పటికీ, కర్ణాటకలో మాత్రం సర్కార్ కు ఈ పథకం భారంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మహిళ బస్సు అమలు చేయడంతో ఆర్టీసీకి నష్టం వచ్చి, వాటిని భరించేందుకు ఇతర ఛార్జీలను పెంచుతున్నారు. దీంతో పాటు సరైన ముందస్తు చర్యలు తీసుకోకుండా హడావిడిగా అమలు చేయడంతో బస్సుల్లో మహిళలు సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. టటిక్కెట్ కొన్న పురుషులకు సీట్లు దొరకడం లేదు. పథకం అమలు చేసే ముందు సరిపడా బస్సులను కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది.
అధ్యయనం చేసిన తర్వాత...
కానీ ఆంధ్రప్రదేశ్ బాగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చేసింది. ఇప్పటికే కొన్ని బస్సులను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన నగరాలకు, పట్టణాలకు పంపుతూనిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగపడనున్నాయి. నగరాల్లోనే ఎక్కువ రద్దీ ఉంటుందని భావించి అక్కడ ఎక్కువ బస్సులను కొనుగోలు చేస్తుంది. అలాగే ఈ పథకం జిల్లాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఆ యా జిల్లాలకు చెందిన మహిళలు ఆ జిల్లా పరిధిలోనే ఉచితంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఉచిత బస్సు పథకంలో మరికొన్ని నిబంధనలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News