Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో లక్ష నగదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో రాజీ పడరు

Update: 2026-03-12 05:39 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో రాజీ పడరు. నిధుల కొరత అని వెనుకాడరు. వారే డ్వాక్రా మహిళలు. చంద్రబాబు నాయుడు 1995 లో ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకూ ఆయన డ్వాక్రా సంఘాల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధకనపరుస్తారు. మహిళలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడు కేవలం వారి కుటుంబాలు మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా పురోగమిస్తుందని ఆయన భావిస్తారు. అందుకే ఎప్పుడు అధికారంలో ఉన్నా చంద్రబాబు డ్వాక్రా మహిళల విషయంలో ఏ మాత్రం ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకుంటారు. 2019 ఎన్నికలకు ముందు కూడా పసుపు కుంకుమ పేరుతో పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన నేత చంద్రబాబు.

మహిళ దినోత్సవం రోజున...
అయితే ఇప్పడు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటయి ఇరవై ఐదేళ్లు పూర్తయింది. అయితే వచ్చే నెల 8వ తేదీన చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు మరిన్ని బహుమతులు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు ముఖ్యమైన పథకాలతో పాటు వారికి నజారానాలు కూడా ప్రకటించనున్నారు. లక్ష రూపాయల వరకూ పావలా వడ్డీకే రుణం ఇవ్వనున్నారు. డ్వాక్రా కుటుంబ మహిళ కుటుంబాల్లో విద్య, వివాహం కోసం ఈ లక్ష రూపాయలు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి అని పేర్లు కూడా పెట్టారు. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేశారు. అర్హులైన వారందరికీ ఈ పథకాలను వర్తింప చేస్తారు.
వీరే అర్హులు...
డ్వాక్రా మహిళా సంఘాల్లో సభ్యురాలిగా ఆరు నెలల క్రితం నమోదయిన వారు ఈ పథకాలకు అర్హులు. అంతకంటే ఎక్కువగా కాలం నుంచి సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారు. బయోమెట్రిక్ నమోదు ఆధారంగా ఈ రెండు పథకాలను అమలు చేయనున్నారు. మహిళదినోత్సవం సందర్భంగా ఈ రెండు పథకాలను చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. నిజానికి గత ఏడాది అక్టోబరు నెలలోనే ఈ రెండు పథకాలను అమలులోకి తీసుకు రావాలని ప్రయత్నించినప్పటికీ లోటు పాట్లు లేకుండా చేయడానికి బలమైన నిబంధనలు, విధివిధానాలను రూపొందించి మార్చి 8వ తేదీన ప్రకటించిన ఈ పథకాలను మహిళలకు అందించనున్నారు. ఇందుకు అర్హతలను కూడా నిర్ణయించారు.


Tags:    

Similar News