టీడీపీ నేత ఇంటికి సీబీఐ

టీడీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. పెనుకొండ టీడీపీ నేత సవిత ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి సీబీఐ సోదాలు జరుపుతోంది

Update: 2022-11-04 06:07 GMT

తెలుగుదేశం పార్టీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. పెనుకొండ టీడీపీ నేత సవిత ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి సీబీఐ సోదాలు జరుపుతోంది. సవిత భర్త రైల్వే కాంట్రాక్టర్. రైల్వే కాంట్రాక్ట్ లలో జరిగిన అవకతవకపై సీబీఐ అధికారులు ఈ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం.

కీలక డాక్యుమెంట్లు...
పెనుకొండలో ఉన్న ఆమె గృహంలో తనిఖీలు చేస్తున్న సీబీఐ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలో నమోదయిన ఒక కేసు విషయంలో ఈ సోదాలు నిర్వహించారని తెలిసింది. కొన్ని రికార్డులతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News