కుప్పం టీడీపీ నేతలపై కేసులు

కుప్పం తెలుగుదేశం నేతలపై భారీగా కేసులు నమోదయ్యాయి. నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనలో టీడీపీ నేతలపై ఈ కేసులు నమోదయ్యాయి

Update: 2022-08-25 12:05 GMT

కుప్పంలో తెలుగుదేశం పార్టీ నేతలపై భారీగా కేసులు నమోదయ్యాయి. నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనలో టీడీపీ నేతలపై ఈ కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులతో సహా మరో ఎనిమిది మంది పై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. రామకుప్పంలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది.

హత్యాయత్నం కేసులు...
ఈ ఘటన పై వైసీపీ కార్యకర్త గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటుటగా 143, 147,148, 149, 424 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరు కాక మరో పదకొండు మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. రెండు రోజుల నుంచి కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.


Tags:    

Similar News