Rk Roja : రోజా చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు.. ముహూర్తం డిసైడ్ అయినట్లేనా?
మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ కు రంగం సిద్ధమయినట్లు ప్రచారం ఊపందుకుంది.
మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ కు రంగం సిద్ధమయినట్లు ప్రచారం ఊపందుకుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను ఈరోజు, రేపట్లో సమర్పించనుంది. ఈ నివేదిక తర్వాత ఆర్కే రోజాను అరెస్ట్ చేయడం ఖాయమని అంటును్నారు. ఇటీవల ఆర్కే రోజా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఆమె కూటమి ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆర్కే రోజా నేతృత్వంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నివేదిక అందిన తర్వాత యాక్షన్ తీసుకుంటారని అటున్నారు. అది ఎప్పుడన్నది చెప్పకపోయినా వంద కోట్లకు పైగానే ఈ ఆడుదాం ఆంధ్ర్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు తేల్చినట్లు తెలిసింది.
టీడీపీ నుంచి...
తెలుగుశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా తర్వాత వైసీపీలో చేరారు. నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించారు. మూడోసారి మాత్రం 2024 ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల కాలంలో కొన్ని బుల్లి తెర షోలలో కూడా ఆర్కే రోజా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వైసీపీకి వాయిస్ గా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆర్కే రోజా లోకేశ్ రెడ్ బుక్ లో మొదటి పేజేలోనే పేరుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ఫిర్యాదులు అందడంతో...
ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పడు తొలి రెండున్నరేళ్లు ఏపీఐఐసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసి తర్వాత టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా పదవి బాద్యతలను చేపట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రమంతటా క్రీడా సంబరాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రపేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఐడీకి ఫిర్యాదు చేశాయి.
చేతివాటం ప్రదర్శించారంటూ...
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కూడా అదే తేల్చినట్లు తెలిసింది. ఆడుదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి పేరు కూడా వినపడింది. పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గత కొన్నాళ్లుగా విచారణ చేసి దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. కేవలం వైసీపీకి చెందిన వారికే బహుమతులను అందచేశారని, అలాగే నిధులను ఖర్చు చేయడంలోనూ చేతివాటాన్ని ప్రదర్శించారని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. దీంతో ఆర్కే రోజాను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.