రైల్వే మంత్రికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణు లేఖ
బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు
బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. విశాఖ నుంచి విజయవాడకు మరికొన్ని వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని ఆయన లేఖలో కోరారు. ఇటీవల డీడీఆర్సీ సమావేశంలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు రహదారి ఇంకా నిర్మాణం పూర్తి కాకవపోవడంతో అక్కడకు వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు విశాఖ నుంచి వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పడుతుందన్నారు.
వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలంటూ...
అందుకే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విశాఖ ఉత్తర శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు లేఖ రాశారు. విశాఖ విమానాశ్రయం జూన్, జులైలో భోగాపురానికి మారుతోందని, అదనంగా వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేక వందేభారత్ రైళ్లు అవసరమని తెలిపారు. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నె వెళ్లేందుకు ప్రత్యేక వందేభారత్ రైళ్లు అవసరమన్నారు. విశాఖ-విజయవాడ సెక్టార్‌లో పలు రైళ్ల అవసరం పెరగనుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేఖలో తెలిపారు.