శ్రీశైలం దారిలో ఎలుగుబంటి దాడి.. ఇద్దరికి గాయాలు

శ్రీశైలం సున్నిపెంట రోడ్డులో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది.

Update: 2025-01-26 04:34 GMT

శ్రీశైలం సున్నిపెంట రోడ్డులో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఎలుగుబంటి శ్రీశైలం వెళ్లే దారిలో సంచరిస్తూ అటు వెళ్లే ప్రయాణికులను భయాందోళనలకు గురి చేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న జంతువులు రహదారిపైకి వస్తున్నాయి. జనసంచారంలోకి వచ్చి ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

చిరుతలు, ఎలుగుబంటి...
అయినా చిరుతలు, ఎలుగుబంటి దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఎలుగుబంటి ముగ్గురు యువకులపై దాడి చేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్కూటిపై శ్రీశైలానికి వెళుతుండగా ఎలుగుబంటి దాడి చేసింది.


Tags:    

Similar News