Kesinani Naii : బెజవాడ సోదరుల వివాదం వీధికెక్కాయా? ముగింపు అదేనా?

బెజవాడ బ్రదర్స్ కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య యుద్ధం పీక్ కు చేరుకుంది

Update: 2025-04-25 11:43 GMT

బెజవాడ బ్రదర్స్ కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య యుద్ధం పీక్ కు చేరుకుంది. గత రెండు రోజులుగా కేశినేని నాని చేస్తున్న ఆరోపణలపై ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినాని చిన్ని స్పందించారు. వంద కోట్ల రూపాయల పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపారు. అయితే లీగల్ నోటీసులకు కేశినేని నాని స్పందించారు. తాను పది సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, జవాబుదారీతనం పారదర్శక,సమగ్రతతో పనిచేశానని చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్న కేశినేని నాని తాను మౌనంగా ఉండబోనని, అక్రమాలపై ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పకుండాబెదిరింపులకు దిగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెదిరింపులకు భయపడే వాడిని కాను...
తాను బెదిరింపులకు భయపడే వాడిని కానని, బెదిరిస్తే లొంగిపోనని కూడా కేశినాని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను దేని కోసం నిలబడ్డానో తనకు తెలుసునని, నిజాలపైనే తాను మాట్లాడతానని, స్పందిస్తానని, మౌనంగా ఉండటం తనకు చేతకాదన్నారు. బహిరంగంగా స్పందించడమే తనకు అలవాటు అని కేశినేని నాని చెప్పారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తాను రాజీపడనని కూడా కేశినేని నాని చెప్పారు. నిజం బెదరింపులకు లొంగదు అని కూడా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు.
స్ట్రాంగ్ గా చిన్ని కౌంటర్...
"నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు" అంటూ కేశినాని నాని ఎక్స్ లో ట్వీట్ చేశారు. మరోవైపు కేశినేని చిన్ని కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం పరిశ్రమాలను , ఉపాధి అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఐలను భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తాను చట్టపరంగా అడ్డుకుంటానని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ఆర్ఐలు దేనికీ భయపడాల్సిన పనిలేదని, వచ్చి తమ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛగా పెట్టుకోవచ్చని, ఎవరి బెదిరింపులకు భయపడవద్దని కూడా కేశినేని చిన్ని అన్నారు. దీంతో మరోసారి బెజవాడ బ్రదర్స్ మధ్య వివాదం రచ్చకెక్కినట్లయింది. ఇదంగా జగన్ రెడ్డి కుట్రలో భాగమేనని కేశినేని చిన్ని అన్నారు. ఇది జగన్ పథక రచనలో భాగమేనని అన్నారు.


















Tags:    

Similar News