లిక్కర్ డబ్బులు పంచుకోవడానికే వచ్చారేమో?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో డబ్బులు పంచుకోవడానికి వచ్చిన నేతలు మినహా బీఆర్ఎస్ సభకు ఎవరూ రాలేదని బండి సంజయ్ అన్నారు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో డబ్బులు పంచుకోవడానికి వచ్చిన నేతలు మినహా బీఆర్ఎస్ సభకు ఎవరూ రాలేదని బండి సంజయ్ అన్నారు. కుమారస్వామి, నితీష్ కుమార్ లు కూడా ఈ సభకు హాజరుకాకపోవడానికి అదే కారణమని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ వద్ద ఉన్న డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
జోకర్ మాటలు...
తెలంగాణలో ఉచిత విద్యుత్తు ఏ మేరకు అమలవుతుందో అందరికీ తెలుసునని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు జనాలు నవ్వుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన సెటైర్ వేశారు. గతంలో మాట్లాడిన మాటలనే కేసీఆర్ పదే పదే చెబుతున్నారని, అందులో కొత్తదనం ఏమీ లేదన్నారు. నిన్న న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ నే జనం చూశారని, బీఆర్ఎస్ సభను ఎవరూ చూడలేదన్నారు. వందేభారత్ ట్రెయిన్ లు మేకిన్ ఇండియాలో భాగమేనని ఆయన తెలిపారు.