Andhra Pradesh : నేడు మన్యం జిల్లా బంద్
ఆంధ్రప్రదేశ్ లో నేడు మన్యం ప్రాంతం బంద్ కు పిలుపు నిచ్చారు. అక్కడి నిరుద్యోగులు తమకు ప్రత్యేక డీఎస్సీ కావాలని కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో నేడు మన్యం ప్రాంతం బంద్ కు పిలుపు నిచ్చారు. అక్కడి నిరుద్యోగులు తమకు ప్రత్యేక డీఎస్సీ కావాలని కోరుతున్నారు. ప్రత్యేక డీఎస్సీ సాధన కోసం నేడు ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మన్యం జిల్లాల్లో బంద్ జరగనుంది. మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ ఉపాధ్యాయుల నియామకాలకు, పోస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రత్యేక డీఎస్సీ కోరుతూ...
మన్యం జిల్లాకు బంద్ కు పిలవనివ్వడంతో పోలీసుల ప్రదర్శనలు, సభలపై ఆంక్షలు విధించారు. టూరిజంపై బంద్ ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. భారీగా పోలీసులు మొహరించారు. సాధన కమిటీకి చెందిన నేతలను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.