Ayyannapatrudu : జగన్ పై అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పరోక్షంగా అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

Update: 2025-09-14 07:45 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పరోక్షంగా అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీకి కనీసం యాభై రోజులైనా హాజరు కావాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. సభకు హాజరుకాకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

ప్రజలు మనల్ని ఎన్నుకున్నది...
ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నామని అయ్యన్నపాత్రుడు అన్నారు. చిరుద్యోగులకు సయితం నో వర్క్ నో పే విధానం అనుసరిస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్ సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు వాటికి రాకపోతే ఎలా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.


Tags:    

Similar News