ఆడుదాం ఆంధ్ర లో అవినీతి.. నిర్ధారణ

ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు

Update: 2026-04-08 06:52 GMT

ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందని నిర్ధారించాారు.దాదాపు నలభైకోట్ల మేరకు నిధులు పక్కదోవ పట్టాయని నివేదికలో పేర్కొంది. దీంతో ఆర్కేరోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఐఏఎస్ అధికారి, శాప్ ఛైర్మన్ పై కూడా కేసు నమోదు చేసి విచారించాలని సూచించింది. ఈ మేరకు విజిలెన్స్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.

రాజకీయాలపై రోజా...
మరొకవైపు ఆర్కే రోజా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు రోగాలు తెచ్చిపెడుతున్నాయని అన్నారు. తొలి సారి ఎమ్మెల్యేగా అయినప్పుడు బీపీ వచ్చిందని, రెండో సారి ఎమ్మెల్యే అయినప్పుడు షుగర్ వచ్చిందని ఆర్కే రోజా అన్నారు. అయితే విజెలెన్స్ నివేదిక కు ముందే ఆర్కే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. 








Tags:    

Similar News