థియేటర్ల బంద్ నిర్ణయం వెనక వారే : అత్తి సత్యనారాయణ
జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.
జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అంటూ బాంబు పేల్చారు. దిల్ రాజు తన సోదరుడిని కాపాడుకోవడానికి తనపై లేనిపోని నిందలు వేశారన్నారు. దిల్ రాజు కమల్ హాసన్‌ను మించి ఆస్కార్ రేంజ్‌లో నటించాడంటూ ఎద్దేవా చేశారు.
దురుద్దేశ్యంతోనే...
దిల్ రాజు దురుద్దేశంతోనే తన పేరు చెప్పారన్న అత్తి సత్యనారాయణ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తాకరని అన్నారు. తాను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదని అత్తి సత్యనారాయణ తెలిపారు. దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డితో పాటు దగ్గుబాటి సురేష్ కూడా థియేటర్ల బంద్ నిర్ణయం వెనక ఉన్నారని అన్నారు.