అర్ధరాత్రి నెల్లూరు రోడ్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి

అర్ధరాత్రి వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచారు.

Update: 2025-07-29 04:35 GMT

అర్ధరాత్రి వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచారు. వారు చేసిన ఫోన్ కు స్పందించారు. నెల్లూరులో ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భార్యాభర్తలను ఆపి, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పది వేల రూపాయల జరిమానా చెల్లించాలని పోలీసులు తెలిపారు.

ఫోన్ చేయడంతో...
నడిరోడ్డుపై వారిని వదిలేసి బైకు స్వాధీనం చేసుకోవడంతో బిక్కుబిక్కుమంటూ బాధితుల ఆవేదన చెంది తమపై అక్రమ కేసులు బనాయించి తమ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆ దంపతులు కోటంరెడ్డికి ఫోన్ చేశారు. దీంతో విషయం ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి చేరడంతో అర్ధరాత్రి స్పందించి, అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వారిని పంపించి వేసేలా ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News