పవన్ పై పరువు నష్టం కేసు : ఏపీ ప్రభుత్వం ఆదేశం
ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దానిని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నారని పవన్ విమర్శలు చేశారు. మహిళల అక్రమ..
PK comments on volunteers
వారాహి రెండో విడత యాత్రలో భాగంగా జులై 9న ఏలూరులో నిర్వహించిన సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లమన్న పేరుతో ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దానిని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నారని పవన్ విమర్శలు చేశారు. మహిళల అక్రమ రవాణా వెనుక వాలంటీర్ల హస్తం ఉందని అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ వెంటనే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ సైతం నోటీసులు పంపింది. ఈ మేరకు వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన వార్తల ఆధారంగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.