ఎంత ఖర్చయినా సరే... అండగానే ఉంటా

కేవలం తాను ఇచ్చిన హామీలతో నిమిత్తం లేకుండా అందరికి ప్రయోజనం చేకూరేలా పథకాలను రూపొందించామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు

Update: 2022-01-25 06:14 GMT

కేవలం తాను ఇచ్చిన హామీలతో నిమిత్తం లేకుండా అందరికి ప్రయోజనం చేకూరేలా పథకాలను రూపొందించామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని జగన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అగ్రకులాల్లో ఆర్థింకగా ఇబ్బందిపడుతున్న 45 నుంచి 60 సంవత్సారాలలోపు ఉన్న మహిళలకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక స్వాంతన చేకూరుస్తున్నామని చెప్పారు.

కరోనా సమయంలోనూ....
ఈ పథకం ద్వారా 3.92 లక్షల మంది లబ్దిదారులకు 589 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు. రానున్న మూడేళ్లలో వీరికి నలభై ఐదు వేలు అందిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ ఆసరా పథకం 78 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని జగన్ చెప్పారు. 25,517 కోట్లు నాలుగు దఫాలుగా నేరుగా వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటికే రెండు విడతలు ఇచ్చామని, 12,750 కోట్లు ఇచ్చామని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయలేదని జగన్ తెలిపారు. అనేక పథకాలతో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆర్థిక బాధలను చూసుకోబోమన్నారు. ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.


Tags:    

Similar News